![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి (Godhavari)'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 43 లో.. జానూ సోఫాలో కూర్చుంటుంది. అప్పుడే నందు కాఫీ తోసుకొచ్చి నందుకి ఇస్తుంది. జాను కాఫీ తాగుంతుంటే ఎక్కడికి దాకా వచ్చిందని నందు అడుగుతుంది. ఇప్పుడే తాగడం స్టార్ట్ చేశానని జానూ అనగానే నేను అడిగేది కాఫీ గురించి కాదు.. నా పెళ్ళి పనుల గురించి అని నందు అంటుంది. ఆ పని మీదే ఉన్నాను.. తోట అమ్మిన అతని దగ్గరికి వెళ్ళాను.. తొందరలోనే సాల్వ్ చేసి నీ పెళ్ళి చేస్తాను అక్క అని జానూ అనగానే నా మంచి జానూ అని నందు అంటుంది. అప్పుడే గౌతమి బిస్కెట్స్ తీసుకొచ్చి జానూకి ఇస్తుంది. నాకెందుకే అని జానూ అనగానే ఛాయ్ లో బాగుంటందని గౌతమి అంటుంది. అప్పుడే వాళ్ళ నానమ్మ వచ్చి.. నువ్వు దేనికి ఎసరుపెట్టావే అని అంటుంది. అదేంటి అని గౌతమి అనగానే అది కాఫీ ఇచ్చి కాకాపట్టింది.. నువ్వు బిస్కెట్స్ ఇచ్చి ఏదో అడగడానికి వచ్చావ్ కదా అని అంటుంది.
ఇక ఆ తర్వాత తన కాలేజీ అడ్మిషన్ గురించి గౌతమి అడుగగానే సరే నేను చూసుకుంటానని జాను అంటుంది. ఒసేయ్ .. కుటుంబ భారమంతా జానూ మీదే పడింది. దానిని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి అని వాళ్ళ నానమ్మ అనగానే వదిలేయండి నానమ్మ నేను చూసుకుంటానని జానూ అంటుంది. ఆ తర్వాత కిన్నెర ఒక డ్రాయింగ్ వేసుకొని వచ్చి నందుకి ఇస్తుంది. అది చూసి నందు సూపర్ గా డ్రా చేశావని అంటుంది. ఆ డ్రాయింగ్ చూసి గౌతమి బాగుందని అంటుంది.అది జానూ చూసి అలా చేయకూడదు తప్పు అని అంటుంది. అది మురళి తోసుకొని చూసి సూపర్ డ్రా చేశావని అంటాడు. అదేంటంటే మురళి వాళ్ళ అమ్మ శాంత బొమ్మని డ్రా చేసి గయ్యాళి అని రాసి ఉంటుంది. దీనిని ఫ్రేమ్ కట్టించి గుమ్మానికి పెట్టాలని నందు అనగానే అప్పుడే శాంతా వస్తుంది.
ఏంటే గుమ్మానికి పెట్టేదని శాంత అడుగగా బూడిద గుమ్మడికాయ అని మురళి కవర్ చేస్తాడు. డ్రాయింగ్ అని గౌతమి అనగానే అదేమో డ్రాయింగ్ అంటుంది నువ్వేమో గుమ్మడి కాయ అంటున్నావని శాంతాకి డౌట్ వస్తుంది. ఇక నందు చేతిలో ఉన్న ఆ డ్రాయింగ్ పేపర్ చూసి ఎవరే ఇది డ్రా చేసిందని కోప్పడుతుంది. నేనే అని కిన్నెర ముందుకొస్తుంది. ఇక శాంతా ఒక కర్ర తోసుకొని వస్తుంది. చేయి చాపవే కొడతానని శాంతా అనగానే కిన్నెర చేయి చాపుతుంది. ఇక శాంతా కొట్టబోతుంటే తనని ఆపుతుంది జానూ. ఇంట్లో ఎవరేం తప్పు చేసినా అది నాదే తప్పు.. నన్ను కొట్టండి అని అని జానూ అనగానే శాంతా కొట్టబోతుంటే నన్ను కొట్టమని నందు అంటుంది. ఇక నందుని కొట్టబోతుంటే గౌతమి ముందుకొస్తుంది. ఇక గౌతమిని శాంతా కొట్టబోతుంటే వాళ్ళ నానమ్మ వచ్చి.. ఈ ఇంటిపెద్ద నేను.. కావాలంటే నన్ను కొట్టమని నానమ్మ అనగానే ఇక శాంతా కొట్టకుండా కోపంగా వెళ్ళిపోతుంది. జానూని శారద కోప్పడుతుంది. ఆ సింహాద్రి అన్నయ్య మంచోడు, ఎందుకు అనవసరంగా అతన్ని నిందిస్తున్నావని అడుగగా అతను ఏదో దాస్తున్నాడని జానూ అంటుంది. తరువాయి భాగంలో లాయర్ ని కలుస్తుంది జానూ. అతను డబ్బులు అడుగగా జానూ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |